Abhay Ram- Bhargav Ram- Venky: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సందడి.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో

by I. Sairam |   (  Updated:2024-11-04 04:29:50  IST  )

జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) బావమరిది, హీరో నార్నె నితిన్(Narne Nithin) అందరికీ సుపరిచితమే.

Abhay Ram- Bhargav Ram- Venky: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సందడి.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) బావమరిది, హీరో నార్నె నితిన్(Narne Nithin) అందరికీ సుపరిచితమే. ‘మ్యాడ్’(MAD) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ‘ఆయ్’(Aay) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. నార్నె నితిని సోమవారం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి పేరు శివాని(Shivani) కాగా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు టాలీవుడ్‌లోని అనేక మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తరలివచ్చారు. అయితే ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్(Abhay Ram), భార్గవ్ రామ్(Bhargav Ram) ఇద్దరికి సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి సరదాగా గడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరితో సరదాగా ఆడుకుంటూ, నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story