- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ నిజాలు చెప్పాలి.. MLA డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ సీఎం కేసీఆర్(KCR)కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. ‘కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో వచ్చిన విషయాల ఆధారంగా కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని మేం భావిస్తున్నాం. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు అందరూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో తెలియడం లేదు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లుగా హరీష్ రావు అంటున్నారు.. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అమరవీరుల త్యాగాల్లో ఉంటుంది.. ఈ విషయాన్ని హరీష్ రావు తెలుసుకోవాలి. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు విచారణలకు హాజరయ్యారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వగానే ఏదో జరిగిపోతుందని హడావుడి చేస్తున్నారు’ అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారు.. కేసీఆర్ సిట్ ముందు హాజరై విచారణకు సహకరించి నిజాలు చెప్పాలి.. కేసీఆర్ వయసు ఆధారంగా ఆయనకు సిట్ అధికారులు గౌరవం ఇస్తారు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెపుతోంది.. కేసీఆర్ చట్టానికి సహకరించాల్సిందే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.






