తుపాకీతో కాల్చుకుంటున్నట్లు ఫోజ్.. గన్ పేలడంతో యువకుడు మృతి

by Malleboina Mahesh |

గన్‌తో రీల్స్ చేస్తూ యువకుడి మృతి. ఢిల్లీలో ఫోటో కోసం ఫోజ్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.

తుపాకీతో కాల్చుకుంటున్నట్లు ఫోజ్.. గన్ పేలడంతో యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: లైసెన్స్డ్ గన్ తో రీల్స్ చేస్తున్న వ్యక్తి.. తుపాకి పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దల్లూపురా గ్రామానికి చెందిన పవన్ కుమార్ (28) అనే యువకుడు సోమవారం తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకిని లోడ్ చేసి ఛాతీకి ఎడమ వైపు షూట్ చేసుకుంటున్నట్లు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఆ క్రమంలో ట్రిగర్ నొక్కుకోవడం తో గన్ పేలింది. ఈ షాకింగ్ ఘటనలో తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే పవన్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు న్యూ అశోక్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు గన్ తో ఫోటోలు దిగుతుండగా.. ఒక్కసారిగా అధి పేలడం స్పష్టంగా కనిపించింది.

Next Story