- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
UFOను చూడగానే గర్భందాల్చిన మహిళ..?! పెంటగాన్ పరేషాన్!!
దిశ, వెబ్‌డెస్క్ః తాజాగా అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఒక విచిత్రమైన నివేదికను ప్రకటించింది. UFOను చూసిన తర్వాత ఓ మహిళ గర్భవతి అయ్యానని పేర్కొన్నట్లు అందులో వెల్లడించారు. మానవ, జీవ కణజాలాలపై క్రమరహిత అక్యూట్, సబాక్యూట్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ అనే పేరుతో ఉన్న ఈ నివేదికలో, UFO ఎన్‌కౌంటర్లు ప్రజల ఆరోగ్యంపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ది సన్ యుఎస్ ద్వారా విడుదలైన ఈ నివేదిక, "అనామాలిస్ అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ద్వారా మానవ పరిశీలకులకు" అయిన గాయాలను పరిశోధించింది. ఈ నివేదిక అనేక విచిత్రమైన దుష్ప్రభావాలను లిస్ట్ చేసింది. ఇందులో UFOతో గర్భాధారణ పొందడం అన్నింటికంటే వింతైనదిగా తేలింది. లైంగిక ఎన్‌కౌంటర్లు, టెలిపతి గ్రహించిన టెలిపోర్టేషన్ అనుభవాలను కూడా వివరించింది. అలాగే, UFO రేడియేషన్ వల్ల కాలిన గాయాలు, మెదడుకు నష్టం, నరాల మీద ప్రభావం చూపడం వంటి సంఘటనలకు జాబితాలో చేర్చింది.