- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన భక్తిని చాటుకున్న మహిళ.. బియ్యపు గింజలపై శ్రీరామ నామాలు
by Javid Pasha |
దిశ, తుంగతుర్తి : హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు వందన తాను శ్రీ రామనామంతో లిఖించి పంపించిన 10,116 బియ్యపు గింజలు

X
దిశ, తుంగతుర్తి : హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు వందన తాను శ్రీ రామనామంతో లిఖించి పంపించిన 10,116 బియ్యపు గింజలు నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయానికి పోస్టు ద్వారా శనివారం చేరాయి. వీటిని ఆదివారం జరిగే శ్రీ సీతారామ కళ్యాణోత్సవ వేడుకల్లో తలంబ్రాలుగా ఉపయోగిస్తామని ఆలయ అర్చకులు కాటూరి రామాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 'దిశ'కు తెలిపారు. తుంగతుర్తికి చెందిన కొంతమంది భక్తుల ద్వారా వందన పరిచయమై స్వామి వారిపై పెంచుకున్న భక్తితో ప్రత్యేకంగా ప్రతి బియ్యం గింజపై జగదభిరాముడు 'శ్రీరాముని నామాన్ని' రాసి పంపారు. ఇదిలా ఉంటే అధ్యయనోత్సవాలలో భాగంగా ఆలయంలో శనివారం పరమపద ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- Tags
- Rama
- rice grains
Next Story






