- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరో.. థియేటర్స్ తగలడిపోతాయంటూ నెటిజన్ల కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit). భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘కల్ట్’ పోస్టర్‌లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండటం, ఆయనకు త్రిప్తి లైటర్ అంటిస్తుండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచింది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో పలువురు నటులు నటిస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ ఎవరనే దానిపై వస్తున్న ఊహాగానాలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ ప్రాణ స్నేహితుడు, మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించబోతున్నట్లు టాక్. దాదాపు 22 ఏళ్ళ క్రితం ‘వర్షం’ సినిమాలో వీరిద్దరి మధ్య సాగిన పోరు వెండితెరపై ఒక హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబోను రిపీట్ చేస్తూ సందీప్ వంగా ఒక పవర్‌ఫుల్ విలనిజం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో దిగిన ఫోటోలు వైరల్ అవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు థియేటర్స్ తగలడటం ఖాయం అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని సమాచారం. ఇందులో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ ‘స్పిరిట్’ సునామీ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.






