- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరం నడిబొడ్డున ఘోరం.. చిన్నారిపై వీధికుక్క దాడి
హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో వీధి కుక్కల స్వైరవిహారం చేస్తూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో వీధి కుక్కల స్వైరవిహారం చేస్తూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఖైరతాబాద్ (Khairathabad) పరిధిలో ఓ చిన్నారిపై వీధి కుక్క విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ నగర్ (Srinivas Nagar) కు చెందిన పాక శార్వి అనే నాలుగేళ్ల చిన్నారి మంగళవారం తన ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక వీధి కుక్క చిన్నారిపై పడి దాడికి దిగింది. చిన్నారి ముఖంపై కుక్క తీవ్రంగా గాయపరిచింది. పాప అరుపులు విన్న అటుగా బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు, తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను వెళ్లగొట్టారు.
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
చిన్నారి శార్వి ముఖంపై లోతైన గాయాలు కావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బంజారాహిల్స్ (Banjara Hills)లోని రెయిన్‌బో (Rainbow) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ చికిత్స పొందుతోంది. పాప ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజగా ఘటనతో శ్రీనివాస్ నగర్ నివాసితులు భయంతో వణికిపోతున్నారు. కాలనీలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రోడ్లపై తిరగాలంటేనే జంకుతున్నామని వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు స్పందించి, వీధి కుక్కల బెడద నుంచి తమకు విముక్తి కలిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






