- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు
భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్ఆఫ్మినరల్స్అండ్మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) సంస్థ భారత దేశ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుపుతూ దేశానికి అవసరమైన మినరల్స్, మెటీరియల్స్‌ను అందిస్తుందని చీఫ్ప్రిన్సిపల్సైటింస్టు డాక్టర్ఈశ్వరయ్య తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్ఆఫ్మినరల్స్అండ్మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) సంస్థ భారత దేశ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుపుతూ దేశానికి అవసరమైన మినరల్స్, మెటీరియల్స్‌ను అందిస్తుందని చీఫ్ప్రిన్సిపల్సైటింస్టు డాక్టర్ఈశ్వరయ్య తెలిపారు. ఐఎంఎంటీ సంస్థ ప్రతిష్థాత్మక అనేక అవార్డులను అందుకుందని వివరించారు. తెలంగాణ ప్రెస్ఇన్ఫర్మేషన్బ్యూరో ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల టూర్‌కు ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చేరుకుంది. ఈ టూర్‌లో భాగంగా మంగళవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థను సందర్శించింది. ఈ సందర్భంగా ఐఎంఎంటీకి చెందిన సీనియర్ సైంటిస్టుల బృందం ఒడిషా సాంప్రదాయానికి అనుగుణంగా ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సీనియర్సైంటిస్టు.. ఐఎంఎంటీ ఆధ్వర్యంలో చేసిన, చేస్తున్న పరిశోధనలు, పెటెంట్‌లు, కొత్త ఉత్పత్తులకు అందిస్తున్న ప్రోత్సహకాలను ఆయన వివరించారు.
1964లో స్థాపించిన ఈ సంస్థ గత సంవత్సరమే ఈ సంస్థ 50 సంవత్సరాల వేడుకను నిర్వహించిందని ఆయన తెలిపారు. ఇక్కడ దేశానికి అవసరమైన ఖనిజాలు, మెటీరియల్స్, జాతీయ అవసరాలు, ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఖనిజాలు, వాటి ద్వారా అనుబంధ ఉత్పత్తులను తయారు చేయవచ్చో తమ సంస్థ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్ట్రేలియా దేశాలకు తమ సేవలను, పరిశోధలను అందిస్తున్నామని ఆయన వివరించారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో గత ఐదు సంవత్సరాల్లో అత్యధికంగా 25 పెటెంట్‌లను సాధించామని, టెక్నాలజీ టాన్స్ఫర్లను 2024–25లో 10 చేశామని వివరించారు. సంస్థల ఇతర దేశాలు, సంస్థలు, రాష్ట్రాలతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకొని వారికి అవసరమైన పరిశోధనలు అందిస్తున్నామని వివరించారు. రక్షణ రంగంలో కీలకమైన టంగ్స్టన్వాటిని కూడా కనుగోన్నామని తెలిపారు. ప్రపంచంలోనే 84 శాతం టంగ్స్టన్చైనా దేశంలోనే లభిస్తుందని, ఆ దేశం నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తే మన దేశం స్వయంప్రతిపత్తితో తయారు చేసుకోవడానికి వీలుగా భారతదేశం సిద్దంగా ఉందని, అందుకు అనుగుణంగా తాము పరిశోధనలు చేసి విజయవంతమయ్యామని వివరించారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై, హైడ్రో, బయో ఎలక్ట్రిక్‌కు సంబంధించిన వాటిపై, హైడ్రోజన్ జనరేషన్గురించి వివరించారు.
సింగరేణితో ఒప్పందం..
బొగ్గు గనుల తవ్వకాల్లో దేశంలోనే పేరుగాంచిన సింగరేణి సంస్థ ఐఎంఎంటీతో ఒప్పందం కదుర్చుకుంది. గత డిసెంబర్1వ తేదీన రేర్ఎర్త్ ఎలిమెంట్స్, బొగ్గు గనుల తవ్వకాల తరువాత ఉండే వ్యర్థాల్లో ఎలాంటి ఖనిజాలు, ఎలిమెంట్స్, మెటీరియల్స్ ఉన్నాయనే వాటిని కనుగోని వాటిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సింగరేణి సంస్థ తమతో ఒప్పందానికి ముందుకు వచ్చిందని వారు వివరించారు. దీనిపై ఇటీవల పరిశోధనలు ప్రారంభించామని, ఈ పరిశోధనల ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
అరిటి గెలలతో ఎరువు..
అరటి గెలలకు సంబంధించి వృధా వెళ్లే వాటితో రైతులకు అవసరమైన పోటాషియంను, ఎరువును తయారు చేస్తున్నామని సీనియర్శాస్త్రవేత్త తెలిపారు. అరిటి గెలలు తీసిన తరువాత ఉండే బెరడును ఎండబెట్టి దాని కొబ్బరి పీచు తరహాలో తయారు చేసి దానిని ఒక ఇనుప డ్రమ్ములో వేసి కాల్చి డ్రమ్మును తిప్పుకుంటూ ఉండటం ద్వారా పోడి తయారు అవుతుందని ఆయన వివరించారు. 20 కిలోల అరటి బెరడుతో రెండు కిలోల కొబ్బరి పీచు తరహాలో తయారవుతుందని, దానిని కాల్చడం ద్వారా ఒక కిలో పౌడర్తరహాలో తయారవుతుందని తెలిపారు. దీనిని 500 గ్రాములకు రూ.60లకు కొన్ని సంస్థలు విక్రయిస్తున్నాయని తెలిపారు. ఇది పోటాయం కలిగి ఉన్నందున దీనిని పోలాలు, వ్యవసాయ యోగ్యమైన భూముల్లో వేయడం ద్వారా సహజమైన ఎరువులు వేసినట్లుగా అవుతుందని, దీని ద్వారా పంట మంచి దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. ఐఎంఎంటీ సందర్శనలో చీఫ్సైంటిస్ట్లు కాలి సంజయ్, డాక్టర్ ఎన్కే దాల్, డాక్టర్సి.ఈశ్వరయ్య, పవన్‌కుమార్ తదితరులున్నారు.
సీబీసీ కార్యాలయ సందర్శన..
తెలంగాణ పీఐబీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సెంట్రల్బ్యూరో ఆఫ్కమ్యూనికేషన్స్ (సీబీసీ) కార్యలయాన్ని సందర్శించింది. ప్రతినిధి బృందంతో సీబీసీ, పీఐబీ అడిషనల్డైరెక్టర్ ఆఖిల్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ చౌదరిలు భేటీ అయ్యారు. ఒడిషాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఐబీ మీడియా కమ్యూనికేషన్స్ ఆఫీసర్ఓరుగంటి గాయత్రి వారికి జ్ఞాపికను అందించారు. వీటితో పాటుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగుతున్న ఖాది ఎగ్జిబిషన్, కళా భూమిని సందర్శించారు. అక్కడ గిరిజనుల ఆచారాలు, వ్యవహరాలు, వారికి సంబంధించిన పరిశోధనల్లో కనుగోన్న పూర్వకాలపు వస్త్రవులు, వస్త్రధారణ, జీవన విధానానికి సంబంధించిన వాటిని అక్కడ ప్రదర్శించారు.






