పరీక్ష ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని!

by Vinod kumar |

దిశ, కామారెడ్డి రూరల్: ఇటీవల రాసిన పరీక్షల్లో కొన్ని - A student who committed suicide in Kamareddy district

పరీక్ష ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని!
X

దిశ, కామారెడ్డి రూరల్: ఇటీవల రాసిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యానని తెలిసిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష(19) ధర్మారంలోని తిరుమల నర్సింగ్ హోమ్ లో జీఎన్ఎం పూర్తి చేసింది. ఇటీవల రాసిన పరీక్ష ఫలితాల్లో కొన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యానని తెలుసుకుంది. ఈ విషయంలో మనస్తాపం చెందిన శిరీష సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన శిరీష సోదరులు చున్నీ విప్పి కిందకు దింపి చూడగా.. అప్పటికే శిరీష మృతి చెందింది. వ్యవసాయ పనులకు పొలం వద్దకు వెళ్లిన తల్లిదండ్రులకు విషయం తెలిసి బోరున విలపించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story