ప్రాణాల మీదకు తెచ్చిన అల్పాహారం.. బోండా గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

by Kema Shiva Kumar |

అల్పాహారం తింటూ బోండా గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన హృదయవిదారక ఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ప్రాణాల మీదకు తెచ్చిన అల్పాహారం.. బోండా గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అల్పాహారం తింటూ బోండా గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన హృదయవిదారక ఘటన మధురానగర్‌ (Madhura Nagar) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్‌ (Rahmathnagar) ఎస్‌పీఆర్‌ హిల్స్‌ ప్రాంతానికి చెందిన దాసరి రమేష్‌ (45) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణదేవరాయనగర్‌ సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆయన బోండాలు కొనుగోలు చేశారు. అక్కడే పక్కన కూర్చుని తింటుండగా, ఒక్కసారిగా ఒక బోండా ముక్క రమేష్ గొంతులో అడ్డుపడి ఊరిరాక అల్లాడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అతడు ఇవాళ ఐసీయూలో చికిత్ పొందుతూ తుది శ్వాస విడిచాడు.

Next Story