విషాదం నింపిన హోలీ.. బాలుడు మృతి

by samatah |   (  Updated:2022-03-18 09:37:07  IST  )

దిశ, మంథని : హొలీ వేడుక లకు వెళ్లి బొక్కల వాగు గుంతలో బాలుడు గల్లంతు ఐన సంఘటన మంథని లో చోటుచేసుకుంది.

విషాదం నింపిన హోలీ.. బాలుడు మృతి
X

దిశ, మంథని : హొలీ వేడుకలకు వెళ్లి బొక్కల వాగు గుంతలో బాలుడు గల్లంతు ఐన సంఘటన మంథనిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్ పేట గొల్లవాడ కు చెందిన సిద్దు అనే 7 సంవత్సరాల బాలుడు బొక్కల వాగులో స్నానం చేస్తూ గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. గాలింపు చర్యల్లో బాలుడు మృతదేహం లభించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story