- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19 మంది చిన్నారుల్ని బలిగొన్న టెక్సాస్ స్కూల్ కాల్పుల మొదటి వీడియో ఇదే!
మారణకాండపై పోలీసులు ఎలా స్పందించారో కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. Video shows inside Uvalde school during shooting.

దిశ, వెబ్‌డెస్క్ః అమెరికాలో గన్ కల్చర్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. పాఠశాలల్లో చిన్నారులపైన కూడా మారణకాండకు తెగబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల అంతర్జాతీయంగా సంచలనం రేపిన టెక్సాస్‌లోని ఉవాల్డేలోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మృతి చెందగా, ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా వీడియో ఫుటేజ్ విడుదలయ్యింది. ఇందులో, ఘటన సమయంలో సాయుధుడైన ముష్కరుడు రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లోకి ప్రవేశించి, చేసిన మారణకాండపై పోలీసులు ఎలా స్పందించారో కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది.
ఆస్టిన్ అమెరికన్-స్టేట్స్‌మాన్ విడుదల చేసిన వీడియో ఫుటేజ్ ప్రకారం, సాయుధుడు ఖాళీ హాలులో నడుస్తూ, తరగతి గదుల్లోకి కాల్పులు జరపడాన్ని చూడొచ్చు. మధ్యలో ఒక విద్యార్థి అక్కడ ఒక మూలకు వచ్చి, షూటర్‌ను గుర్తించి, పారిపోతాడు. మూడు నిమిషాల తర్వాత, మొదటి పోలీసు అధికారుల బృందం భవనంలోకి ప్రవేశిస్తారు. వారిపై ముష్కరుడు ఫైరింగ్ చేయగా పోలీసులు భయపడుతూ వెనక్కి పారిపోతారు. తర్వాత 19 నిమిషాల పాటు వీడియో కట్ చేయగా, ఈసారి హాలులో భారీగా సాయుధ పోలీసులు కనిపిస్తారు. కానీ, వచ్చిన పోలీసులు తరగతి గదుల్లోకి ప్రవేశించకుండా, 100 రౌండ్ల కంటే ఎక్కువ కాల్పులు జరుపుతున్న ముష్కరుణ్ని నిరోధించకుండా, హాలులోనే ఉండిపోతారు. ఈ మధ్యలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు.
ప్రజల నుండి చాలా ఒత్తిడి వచ్చిన తర్వాత విడుదల చేసిన ఈ వీడియో చూస్తుంటే, అధికారులు చాలా సేపు హాలులో నిలబడి ఉండటం అందర్ని మరింత బాధకు గురిచేసింది. ఒక పోలీసు అధికారైతే మారణహోమం మధ్యలో గోడపై అమర్చిన డిస్పెన్సర్ దగ్గరకు వెళ్లి హ్యాండ్ శానిటైజర్ రాసుకుంటుంటాడు. డెబ్బై ఏడు నిమిషాలు ఎడిట్ చేసిన ఈ వీడియోలో పోలీసు అధికారులు పిల్లల కంటే తమ స్వంత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని చూపించే ఈ వీడియో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది.






