- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం సంబంధిత అధికారులతో కలిసి పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ముందుగా ఖిల్లా బజార్ (పాత బజార్)లోని పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని, అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ ప్రాంతంలో నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం నిర్మాణానికి అనువైన స్థలంపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి అవసరమైన స్థలం, సౌకర్యాలు, నిర్మాణ ప్రతిపాదనలపై ఎమ్మార్వోతో పాటు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ "పాత బజారుకు కొత్త రూపు తీసుకొచ్చేలా, ప్రజలకు ఒకేచోట ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ సేవలు అందే విధంగా నూతన కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది" అని తెలిపారు.
నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.2.25 కోట్లు, మున్సిపల్ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి రూ.7.60 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయితే ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. స్థల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మార్వో, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






