- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో.. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా రక్షణ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్ 2026 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని, 2047 నాటికి 'వికసిత్ భారత్', ఆత్మ నిర్భరత సాధించడానికి ఇది బలమైన పునాది వేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ 2026 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని, 2047 నాటికి 'వికసిత్ భారత్', ఆత్మ నిర్భరత సాధించడానికి ఇది బలమైన పునాది వేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) కొనియాడారు. ఈ ఏడాది రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో ₹7.85 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే సంకల్పానికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్రివిధ దళాల ఆధునీకరణపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సాయుధ దళాల మూలధన వ్యయం (Capital Expenditure) కోసం ₹2.19 లక్షల కోట్లు, ఆధునీకరణ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ₹1.85 లక్షల కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. ఈ కేటాయింపులు దేశ భద్రత, అభివృద్ధి మరియు స్వయం సమృద్ధి మధ్య సమతుల్యతను పెంచుతాయని, భారత సైనిక శక్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.






