మంత్రి KTR తో బెట్ కట్టిన నెటిజన్.. అది నిజమైతే రూ.1 లక్ష ఇచ్చేందుకు సిద్ధం

by Disha Web Desk 2 |
మంత్రి KTR తో బెట్ కట్టిన నెటిజన్.. అది నిజమైతే రూ.1 లక్ష ఇచ్చేందుకు సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిలను ఆకర్షించేందుకు అమెరికా వెళ్లొచ్చిన మంత్రి కేటీఆర్‌‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. అదేవిధంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ట్విట్టర్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ అందరి దృష్టినీ KTR ఆకర్షిస్తుంటారు. అయితే, గురువారం ఓ కంపెనీని ఆహ్వానిస్తూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. అందులో.. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో స్టార్టప్‌లు ఇప్పటికే బిలియన్ల డాలర్ల పన్నులను సృష్టిస్తున్నాయని.. కానీ, బెంగళూరు నగరంలో అధ్వాన్నమైన రోడ్లు, విద్యుత్ కోతలు, సరైన నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని, కానీ, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయంటూ ఓ కంపెనీ ప్రతినిధి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందిస్తూ.. '' మీ బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కు రండి! మా వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది. నగరంలోకి, బయటికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంటుంది. అంతేగాకుండా, తెలంగాణ ప్రభుత్వం 3ఐ మంత్రాతో ముందుకు సాగుతుంది. అవి ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అని'' ట్వీట్ చేస్తూ కంపెనీ ప్రతినిధులకు ఆహ్వానించారు. అయితే, దీనిపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ''మన రోడ్లు ఎలా ఉన్నాయ్ కేటీఆర్? మీరు మీ భార్య, కొడుకుతో బైక్‌పై నగరంలోని అంతర్గత రోడ్లపై ప్రయాణించగలరా? ఒక వేళ నడిపేందుకు సిద్ధమైతే చెప్పండి.. రూ. 1 లక్ష పందెం వేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మరి మీరు చెప్పిన దానిపై ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చూస్తాను'' అంటూ ట్వీట్ చేశారు.




Next Story

Most Viewed