పోలీసులకే చుక్కలు చూపించిన ప్రబుద్దుడు

by Malleboina Mahesh |

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వేములవాడ పోలీసులకు ఓ ప్రబుద్దుడు చుక్కలు చూపించాడు. గురువారం

పోలీసులకే చుక్కలు చూపించిన ప్రబుద్దుడు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వేములవాడ పోలీసులకు ఓ ప్రబుద్దుడు చుక్కలు చూపించాడు. గురువారం రాత్రి వేములవాడలోని చెక్కపల్లి బస్టాండ్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బైక్ పై వచ్చిన వ్యక్తి టెస్ట్ కు సహకరించనని మొండికేశాడు. అల్కా స్కానర్ టెస్ట్ చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా అతను మాత్రం మొండికేశాడు. దీంతో పోలీసులు అతన్ని బలవంతంగా బొలేరో వాహనం లో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. వాహనంలోకి ఎక్కిస్తున్న క్రమంలో కూడా సదరు వ్యక్తి ససేమిరా అనడంతో కానిస్టేబుళ్లు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఠాణాకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story