అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. ఉరి వేసి ఆ తర్వాత..

by Disha Web |
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. ఉరి వేసి ఆ తర్వాత..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్కాపూర్ తండాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రుమాలుతో (టవల్ ) చంపి.. పక్కనే ఉన్న చెరువులోకి తోసేసిన ఘటన చుట్టు పక్కన గ్రామస్తులను భయాందోళనల కలిగిస్తోంది. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ తండాకు చెందిన రాములు(65), తన కోడలు కోట భాయితో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి పనుల నిమిత్తం మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఆ కట్టెల మోపును తన తలపైకి ఎత్తమని రాములును సహాయం అడిగాడు.


రాములు ఆ కట్టెలను ఎత్తాడు. తనతో రాములును కూడా తీసుకెళ్ళాడు. తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తి తడి బట్టలతో వచ్చాడు.. రాములు రాలేదు.. దీంతో తన కోడలు మా మామ ఎక్కడ అని అడిగితే.. ఆ వ్యక్తి భయాందోళనకు గురై అక్కడి నుండి పారిపోయాడు. దీంతో కోటపై తన కుమారుడైన రవికి ఈ విషయాన్ని తెలుపగా రాములు కోసం వెతకసాగాడు. ఎంతకీ ఆచూకీ దొరకలేదు. బుధవారం సాయంకాలం రాములు వ్యవసాయ క్షేత్రం పక్కన ఉన్న చెరువులో శవమై కనిపించాడు. అది గమనించిన స్థానికులు రాములు కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు.

నిజామాబాద్ జిల్లా సౌత్ సీఐ నరేష్, ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ తో వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములను రుమాలుతో (టవల్ ) చంపి పక్కనే ఉన్న చెరువులోకి తోసేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హత్యకు కారణమైన నేరస్తులను త్వరగా పట్టుకుంటామని తెలిపారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed