ఈ బుడ‌త‌డి పార్కింగ్ వీడియో చూసి నెట్టింట్లో మ‌తిపోయింది..?!

by Disha Web Desk |
ఈ బుడ‌త‌డి పార్కింగ్ వీడియో చూసి నెట్టింట్లో మ‌తిపోయింది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ : పిల్లలు పిడుగుల్లాంటి ఝ‌ల‌క్ ఇస్తుంటారని ఈ బుడ‌త‌డు మ‌రోసారి నిరూపించాడు. పిల్లల్లో కొంద‌రు సూప‌ర్ స్మార్ట్‌గా వ్యవ‌హ‌రిస్తుంటారు. అలాంటి వారిలో ఇదిగో ఈ బుడ్డోడు ఒక‌డు. చిన్న వయస్సులోనే స్ట్రీట్‌ స్మార్ట్‌నెస్ అల‌వ‌ర్చుకున్నాడు. సిటీలో షాపింగ్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న వాహ‌నానికి పార్కింగ్ దొర‌క‌డం ఎంత క‌ష్టమో ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. నిజానికి పార్కింగ్ చేయ‌డం కూడా ఓ క‌ళ అని పార్కింగ్ క‌ష్టాలు తెలిసిన‌వారు త‌ప్పక ఒప్పుకుంటారు. అలా పార్కింగ్ చేసిన బుడ్డోడు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. ఈ వీడియోలో మీ వాహనాన్ని ఎలా పార్క్ చేయాలో మాత్రమే కాకుండా, ఎంత స్మార్ట్‌గా ఉండాలో కూడా నేర్పించే పిల్లోణ్ణి చూడొచ్చు.

ఈ వీడియోలో ఓ ఐదేళ్ల పిల్లవాడు కారు పార్కింగ్ స్థలంలో తన సైకిల్‌ను పార్క్ చేస్తున్న దృశ్యం క‌నిపిస్తుంది. ఇక‌, అప్పటికే ఒక వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్న చోటే సైకిల్‌ను పార్క్ చేసిన బుడ్డోడు క‌నీసం వెనక్కి తిరిగైనా చూడ‌క‌పోవ‌డం విశేషం. ఈ 11-సెకన్ల వీడియోలో పిల్లాడి యాటిట్యూడ్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ క్లిప్‌ని Buitengebieden షేర్ చేయ‌గా సోషల్ మీడియాలో రీట్వీట్‌లతో హ‌డావిడి చేస్తోంది. ఇప్పటికే ల‌క్షల్లో వీక్షణలు, వేల‌ల్లో రీట్వీట్‌లు, లైక్‌లు వచ్చాయి.



Next Story

Most Viewed