సూట్ బూట్‌లో 'గోల్‌గ‌ప్ప‌' అమ్ముతున్నాడు! ఎందుకో తెలుసా..?!

by Disha Web Desk 20 |
సూట్ బూట్‌లో గోల్‌గ‌ప్ప‌ అమ్ముతున్నాడు! ఎందుకో తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః రోడ్‌సైడ్ ఫుడ్ బిజినెస్ గురించి భార‌తీయుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. ఈ తినుబండారాలు అమ్మేవాళ్లు చూడ‌టానికి ఎలా ఉన్నా హాట్ హాట్‌గా ఉండే భ‌లే టేస్టీ ఫుడ్ అందిస్తారు. అయితే, ఇక్క‌డ ఇద్ద‌రు యువ‌కులు సూటుబూటు వేసుకొని, రోడ్డు ప‌క్క‌న‌ గోల్‌గ‌ప్ప‌లు అమ్ముతున్నారు. ఇండియా రోడ్ల వెంట పానీపూరి, చాట్ బండ్ల ద‌గ్గ‌ర ర‌ద్దీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 'బిజినెస్ ఎంత బాగుంటే మాత్రం మీరీ సూటుబూటు వేసుకొని అమ్మాలా అంటారా..?!' అయితే, వీళ్లు ఇలా అమ్మ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. చండీగఢ్ సమీపంలోని మొహాలీకి చెందిన 22 ఏళ్ల సిక్కు యువ‌కుడు, అతని సోదరుడు గోల్‌గ‌ప్ప నుండి ఆలూ టిక్కీ వరకు ర‌క‌రకాల టేస్టీ స్ట్రీట్ ఫుడ్‌ను అమ్ముకుంటున్నాడు. హ్యారీ ఉప్పల్ అనే యూట్యూబర్, ఫుడ్ బ్లాగర్ ఇటీవల ఈ చాట్ స్టాల్‌ని సందర్శించి, ఆ యువకుడితో అతని వ్యాపారం, విభిన్నంగా సూటుబూటు ధ‌రించ‌డం గురించి మాట్లాడాడు.

హోట‌ల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్న ఈ యువ‌కుడు త‌న కాళ్ల‌పై తాను నిల‌బడాల‌నే ఉద్దేశంతో, కొన్ని నెల‌లు కష్టపడి కూడ‌బెట్టుకున్న‌ డబ్బుతో ఈ స్టాల్ ప్రారంభించాడు. అయితే, దుకాణం తెరిచిన త‌ర్వాత క‌రోనా మహమ్మారి ప్ర‌భావంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదుర్కున్నాడు. చేసేది లేక‌, కోవిడ్ కాలంలో టీ అమ్ముకున్నాడు. అయితే, అత‌ను ఏది చేసినా సూట్ వేసుకునే చేయ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌. తాను హోటల్ మేనేజ్‌మెంట్ చదివానని, చ‌దువుకునేట‌ప్పుడు అదే యూనీఫాంగా ధ‌రించేవాడు గ‌నుక‌, అదే కొన‌సాగిస్తున్నాని చెబుతాడు. ఒక‌టి ప్ర‌జ‌ల‌కు తాను హోట‌ల్ మేనేజ్‌మెంట్ చేసాన‌ని తెలియాలి, రెండు ఉద్యోగాలు లేక‌పోయినా, అంత చ‌దువు చ‌దివినా, అంతే గౌర‌వంగా రోడ్డు ప‌క్క‌న బండి పెట్టుకొని బ‌త‌కొచ్చ‌ని తెలియ‌డానికి తాను సూట్ ధరించి ప‌నిచేస్తున్నాన‌ని అంటాడు. భ‌విష్య‌త్తులో 'ఐ లవ్ పంజాబ్‌' పేరుతో హోట‌ల్ ప్రారంభిస్తాన‌ని, త‌న చాట్ వ్యాపారాన్ని మరింత విస్త‌రిస్తాన‌ని చెబుతున్నాడు.


Next Story

Most Viewed