రేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ!.. అందుకే ఆ విషయాలు తెలియదు.. రాణి రుద్రమ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ!.. అందుకే ఆ విషయాలు తెలియదు.. రాణి రుద్రమ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉగ్రవాది, తీవ్రవాది, దేశద్రోహి అని బీజేపీ తెలంగాణ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారన్న దానిపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మోడీ సారధ్యంలో దేశం అభివృద్దిలోకి వెళ్లినట్లే తెలంగాణను కూడా అభివృద్ది చేస్తారని ఆశించి మేమంతా స్వాగతించామని, కానీ ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర వాదుల పాలన నడుస్తోందని ఆరోపించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్ లో పోస్టు చేశారని, అందులో రిజర్వేషన్లపై అమిత్ షా మాటలను తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని, మీ సోషల్ మీడియా మీ నియంత్రణలో లేదా? లేక మీరే లేనివి కల్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు.

అలాగే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ అఫీషియల్ అకౌంట్ లో బండి సంజయ్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడినట్టు మార్ఫింగ్ చేసిన వీడియోలు పోస్టు చేశారని, వీటిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని దీనిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే అంబేద్కర్ గారు మళ్లీ పుట్టి వచ్చి స్వయంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పినా చేసేది లేదని నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో ఉండి చెప్పారని గుర్తు చేశారు. మోడీ రేవంత్ రెడ్డిలా బుడ్డెర ఖాన్ మాటలు చెప్పరని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజల నెత్తిన చిప్ప పెట్టారని దుయ్యబట్టారు. ఆయన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తు్న్నారని అన్నారు. అంబేద్కర్ మత రిజర్వేషన్లకు వ్యతిరేఖంగా రాజ్యాంగంలో రాస్తే దానిని కాలదన్ని బీసీల నుంచి నాలుగు శాతాన్ని తీసి ముస్లింలకు రిజర్వేషన్ చేసిందని అన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియదని, ఆయనది టీడీపీ డీఎన్ఏ, సమైంక్యాంధ్ర డీఎన్ఏ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎప్పుడూ కూడీ బీసీలకు అన్యాయం చేయదని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీలకు ఇచ్చేందుకు బీజేపీ పోరాడుతుందని తెలియజేశారు.

Next Story