షాకింగ్..54 ఏళ్లుగా నీటిలో మునిగిపోయిన గ్రామం బయటపడింది..ఎక్కడంటే?

by Disha Web Desk 18 |
షాకింగ్..54 ఏళ్లుగా నీటిలో మునిగిపోయిన గ్రామం బయటపడింది..ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం వేడెక్కడమే కాదు వరదలు, కరువులు కూడా సంభవిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ఎల్‌నినో ప్రభావంతో ఫిలిప్పైన్స్‌లో కరువు తాండవిస్తోంది. దీంతో అక్కడి జలవనరులు మొత్తం ఎండిపోయాయి. ఈ కారణంగా దాదాపు 54 ఏళ్లుగా నీటిలో మునిగిపోయి ఉన్న న్యువా ఎసిజా ప్రావిన్స్‌లోని పాత పంటబాంగన్ గ్రామం బయటపడింది. కరువు వల్ల అక్కడి డ్యామ్స్‌లో సాధారణం కంటే 50మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. మే రెండో వారం వరకు అక్కడ ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎల్‌నినో అంటే పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్‌ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది. పసిఫిక్‌ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

Next Story