- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివలింగాన్ని దర్శించుకున్న పెద్దపులి.. వైరల్ అవుతున్న అద్భుత దృశ్యం!
"శివయ్య సన్నిధిలో శార్దూలం! అడవిలో శివలింగాన్ని దర్శించుకున్న పులి.. అద్భుత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."

దిశ, వెబ్ డెస్క్: అడవికి రారాజుగా వెలుగొందే పెద్దపులి శివలింగాన్ని దర్శించుకుంటున్నట్లు కనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో భక్తిభావంతో శివలింగాన్ని దర్శించుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దట్టమైన అడవిలో ఉన్న ఒక చిన్న శివాలయం వద్దకు వచ్చిన పులి, అత్యంత ప్రశాంతంగా శివలింగం చుట్టూ తిరుగుతూ, ఆ దేవుడికి ప్రణామం చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. "ప్రకృతి మాతే స్వయంగా ఆ పరమశివుడిని ఆరాధిస్తోంది" అంటూ నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో పులి శివలింగాన్ని వాసన చూస్తూ, ఆ చుట్టుపక్కల చాలా సేపు గడపడం కనిపిస్తుంది. సాధారణంగా మనుషులను చూస్తే దాడి చేసే క్రూర మృగం, దేవుని సన్నిధిలో ఇంత సాధువుగా ఉండటం వెనుక ఏదో దైవిక శక్తి ఉందని భక్తులు బలంగా నమ్ముతున్నారు. ఈ అరుదైన దృశ్యం ఆధ్యాత్మికతను, ప్రకృతిని ఏకం చేస్తూ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ వీడియోపై మరికొందరు స్పందిస్తూ.. ఏఐ వీడియో ద్వారా ఇలాంటివి చేస్తున్నారని.. వైరల్ గా మారిన వీడియో పూర్తిగా ఫేక్ అయి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు.






