- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న మహిళ.. షాక్‌లో గాయకుడు
దిశ, సినిమా: నైజీరియన్ యంగ్ సింగర్ 'మైఖేల్ అడెబాయో అకా రూగర్'పై ..telugu latest news

దిశ, సినిమా: నైజీరియన్ యంగ్ సింగర్ 'మైఖేల్ అడెబాయో అకా రూగర్'పై ఓ మహిళ లైంగిక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అతడికి మద్ధతుగా నిలుస్తున్నారు నెటిజన్లు. విషయానికొస్తే.. ఒక ఈవెంట్‌లో భాగంగా అకా రూగర్ స్టేజిపై తన సింగింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ మహిళ తనతో డ్యాన్స్ చేసేందుకు స్టేజి పైకి రావడంతో నిరాకరించాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. పర్ఫార్మెన్స్ చేస్తూ స్టేజి చివరకు చేరుకున్న రూగర్ పురుషాంగాన్ని నలిపేసేందుకు ప్రయత్నించింది. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన సింగర్.. కొన్ని సెకన్ల తర్వాత తేరుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా 'ఈ పని పురుషులు చేస్తే ఎలాంటి శిక్ష విధించేవారు? కొంతమంది ఆడవాళ్ల వల్ల ఎంతో మంది పురుషులు ఇలా బలవుతున్నారు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






