- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్యాదలా మజాకా... కొత్త అల్లునికి 290 పిండి వంటలతో విందు
కొత్త అల్లునికి తమ మర్యాదలతో ఆశ్ఛర్యంలో ముంచెత్తారు ఆంధ్రా అత్తగారు తరుపున వారు.

దిశ, వెబ్ డెస్క్ : కొత్త అల్లునికి తమ మర్యాదలతో ఆశ్ఛర్యంలో ముంచెత్తారు ఆంధ్రా అత్తగారు తరుపున వారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతి నగర్లో నివసించే నాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష, కూతురు లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగను ఎంతో ప్రత్యేకంగా జరిపారు. గోదారోళ్ల సంప్రదాయాన్ని తలపించేలా అల్లుడి ఏకంగా 290 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు. గురువారం భోజనానికి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు శ్రీహర్ష తన కళ్ల ముందు ఇన్ని రకాల పిండి వంటలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
అరుదైన ఈ స్వాగతం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించగా, తొలి సంక్రాంతిని ఇంత ఘనంగా జరపడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఈ భారీ ఆతిధ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు 'గోదారొళ్ల మర్యాదలా.. మజాకా' అని కామెంట్స్ చేస్తున్నారు.






