- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధ తాళలేక మరో రైతు ఆత్మహత్య హత్య
దిశ, తిరుమలాయపాలెం: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు..latest telugu news

దిశ, తిరుమలాయపాలెం: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోలీపురం పంచాయతీ పరిధిలోని మంగ్య తండాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలపరిధిలోని సోలిపురం పంచాయతీ చివారు మంగ్య తండాకు చెందిన ఎర్రనాగుల నాగులు(45) అదే తండాలో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో మిరప పంటను సాగు చేశాడు. మిరప పంటకు సుమారు 2లక్షల వరకు పెట్టుబడి కింద అప్పు అయింది.
పంటకు వైరస్ సోకి, దిగుబడి రాక తెచ్చిన అప్పు తీర్చలేక నాగులు మనస్థాపానికి గురై ఫిబ్రవరి 19న పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.అయితే గురువారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి నాగులు మరణించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య మదారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బైరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.






