- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
by Manoj |
X
దిశ, ఆదిలాబాద్ : అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అశోక్ నగర్‌లో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని అశోక్ నగర్కు చెందిన రైతు శంకర్ కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలంలో తనకున్న భూమితో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వాటిలో పత్తి, కంది సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడి కోసం రూ. లక్ష అప్పు చేశాడు. గతంలోనూ పంట సాగు, ఇతర అవసరాల కోసం చేసిన అప్పులు రూ. ఐదు లక్షలు ఉన్నాయి. అధిక వర్షాలు, తెగుళ్లతో పంటలు ఆశించినంత దిగుబడి రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలి.. కౌలు ఎలా చెల్లించాలోనని రైతు మనోవేదనకు గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story