క్రేజీ కాంబో.. ప్రభాస్ సరసన నేచురల్ బ్యూటీ.. ‘కల్కి 2’ లో ఊహించని మార్పులు?

by Mallepaka Hamsa |

ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

క్రేజీ కాంబో.. ప్రభాస్ సరసన నేచురల్ బ్యూటీ.. ‘కల్కి 2’ లో ఊహించని మార్పులు?
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి 2’ పైనే ఉంది. అయితే, ఈ సీక్వెల్ గురించి నెట్టింట ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. మొదటి భాగంలో ‘సుమతి’గా కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె క్యారెక్టర్‌కు సెకండ్ పార్ట్‌లో ముగింపు పలికి, ఆ పాత్రలో ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఈ క్రమంలోనే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi)ని ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి తీసుకునేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాయి పల్లవి తన సహజ సిద్ధమైన నటనతో ఎలాంటి ఎమోషనల్ సీన్‌నైనా పండించగలదు. ఆమెకున్న క్రేజ్, పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

దీపికా పాత్ర ముగిసిన తర్వాత వచ్చే మలుపులో సాయి పల్లవి ఎంట్రీ ఉంటుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్(Prabhas)-నాగ్ అశ్విన్ కాంబినేషన్ మీద గట్టి నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్‌కు, ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపించడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రభాస్, సాయి పల్లవి కాంబోలో రాబోతున్న మొదటి మూవీ కావడంతో వీరి కెమిస్ట్రీ చూసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ప్రభాస్ పక్కన సాయి పల్లవిని చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. సాయి పల్లవి డాన్స్ , నటన ఈ సినిమా రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

Next Story