- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు
అమెరికా ప్రకటించిన మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు ఉండటం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా ప్రకటించిన మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు ఉండటం సంచలనంగా మారింది. అయితే ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా, వివిధ రకాల నేర కేసుల్లో నిందితులుగా ఉన్న వలసదారులను గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 25 వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ అరెస్టుల్లో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిలో తీవ్ర నేరాలకు పాల్పడినట్టు గుర్తించిన జాబితాలో 89 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. హత్య, లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసాత్మక దాడులు వంటి తీవ్రమైన కేసుల్లో వీరి పేర్లు నమోదై ఉన్నాయని తెలుస్తోంది. ICE అధికారులు వీరందరినీ "హై రిస్క్ క్రిమినల్స్"గా వర్గీకరించారు. ఈ వివరాలు బయటకు రావడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో కలకలం రేగింది.
తమ దేశ భద్రతకు ముప్పుగా మారేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అమెరికా తెగేసి చెబుతోంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా, నేరాలకు పాల్పడితే అమెరికా చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. నేర కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ICE అధికారులు మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు అక్రమ వలస సమస్యపై అమెరికా ఎంత కఠినంగా ముందుకు వెళ్తోందో స్పష్టంగా తెలియజేస్తోంది.






