ఆ '7 డేస్ 6 నైట్స్'.. ఏం చేశానో తెలిస్తే షాక్ అవుతారంటున్న మెహర్

by Disha Web Desk |
ఆ 7 డేస్ 6 నైట్స్.. ఏం చేశానో తెలిస్తే షాక్ అవుతారంటున్న మెహర్
X

దిశ, సినిమా: సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ బ్యానర్లపై సుమంత్ అశ్విన్, ఎస్‌. రజనీకాంత్‌ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 24న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను అస్సాంలో పుట్టి ముంబైలో సెటిల్ అయ్యా. ఎం.ఎస్. రాజు గారు ఈ స్టోరీ చెప్పగానే ఎగ్జైట్ అయ్యా. దీంతో వెంటనే ఓకే చెప్పేశా. నా క్యారెక్టర్ పేరు రతికా. ఇదొక ఫన్ ఫిల్మ్. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అయితే కొంతమంది అనుకున్నట్లు మరీ అంత బోల్డ్‌ అండ్ వల్గర్‌గా ఏమీ ఉండదు. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో కొంత తెలుగు నేర్చుకున్నానన్న నటి.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలిపింది.



Next Story

Most Viewed