- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6 లక్షల ఆధార్ కార్డులు రద్దు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
by Naresh |
దేశంలో 6 లక్షల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 6 లక్షల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలిపారు. కొందరు ఫేక్ ఆధార్ కార్డ్ నెంబర్లుతో నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆధార్‌తో నేరాలకు పాల్పడుతున్న వారిపై UIDAI కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డూప్లికేట్ ఆధార్ తయారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్‌ను ధృవీకరించడానికి 'ఫేస్' అదనపు ఫీచర్‌గా తీసుకువచ్చామన్నారు. దీని ఫలితంగానే నేడు దేశంలో 5 లక్షలు 98 వేల 999 డూప్లికేట్ ఆధార్ నంబర్‌లు రద్దు చేశామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Next Story






