కెనడాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థుల దుర్మరణం

by Harish |

టొరంటో: కెనడాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టొరంటోకు సమీపంలోని హైవేపై..telugu latest news

కెనడాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థుల దుర్మరణం
X

టొరంటో: కెనడాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టొరంటోకు సమీపంలోని హైవేపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలవగా, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసరియా సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. వారి స్నేహితులతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. మరణించిన వారిని హర్ ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని ట్వీట్ చేశారు.

Next Story