అలా చేస్తాడ‌ని బొమ్మ‌ను పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఇప్పుడు ఓ బిడ్డ కూడా! (వీడియో)

by Disha Web |
అలా చేస్తాడ‌ని బొమ్మ‌ను పెళ్లి చేసుకున్న మ‌హిళ‌.. ఇప్పుడు ఓ బిడ్డ కూడా! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్రేమకు స‌మాజంతో సంబంధ‌మే ఉండ‌దు. అది ఎప్పుడు, ఎలాగైనా, ఎవ్వ‌రి మీదైనా, దేని పైనైనా క‌ల‌గొచ్చు. ప్రేమ‌కున్న ఒక్క ఆశ, ఆశ‌ప‌డిన‌ది తీర్చుకోవ‌డ‌మే..! బ్రెజిల్‌లోని 37 ఏళ్ల మహిళకు ఈ పదబంధం నిజం. త‌న త‌ల్లి ఇంట్లో తయారు చేసిన రాగ్ బొమ్మతో ఆమె ప్రేమలో పడి, ఏకంగా వివాహం చేసుకుంది. తాజాగా, ఈ జంటకు ఒక పాప, అది కూడా ఓ బొమ్మ బిడ్డ ఉండ‌టం విశేషం. 'నీడ్ టు నో' నివేదిక ప్ర‌కారం, మెయిరివోన్ రోచా మోరేస్ అనే మహిళకు ఆమె తల్లి కొన్నాళ్ల క్రితం మార్సెలో అనే బొమ్మను పరిచయం చేసింది. మోరేస్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డానికి భాగస్వామి లేదని తెలుసుకున్న తర్వాత ఆమె త‌ల్లి దానిని త‌యారుచేసింది. మోరేస్ కూడా తరచుగా త‌న‌కు డ్యాన్స్ పార్ట‌న‌ర్ లేడ‌ని ఇంట్లో బాధ‌ప‌డుతూ ఉండేది. "నాకు ఫర్రో డాన్సర్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ బొమ్మ నా జీవితంలోకి వ‌చ్చింది. నేను ఈ డ్యాన్స్ చేయ‌డానిక‌ని ఫంక్ష‌న్ల‌కు వెళ్తాను కానీ ఎప్పుడూ నా డ్యాన్స్‌ భాగస్వామి దొర‌క‌లేదు "అని మోరేస్ నీడ్ టు నోకు చెప్పింది.

ఇక, మార్సెలో మోరేస్ జీవితంలోకి వచ్చిన త‌ర్వాత ఆమె ఆశించ‌న‌ది నెర‌వేరింది. ఇప్పుడు మార్సెలో ఆమెకు నృత్య భాగస్వామి కంటే ఎక్కువ. వాళ్లిద్దరూ ఇటీవ‌ల వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత‌ తన వైవాహిక జీవితం చాలా గొప్పగా ఉంద‌ని ఆమె చెప్పింది. అంద‌రి భ‌ర్త‌ల్లా ఈ బొమ్మ వాదించదు, కొట్టుకోవ‌డం ఉండ‌దు, ఎప్పుడూ త‌న‌ని అర్థం చేసుకుంటుంద‌ని, తాను ఎప్పుడూ కోరుకున్న చ‌క్క‌ని జీవిత భాగ‌స్వామి మార్సెలో మోరెస్సేన‌ని ఆమె వివ‌రించింది. "మార్సెలో గొప్ప, నమ్మకమైన భర్త. ఆడవాళ్ళందరూ అసూయపడేలాంటి వ్యక్తి అతడు, " అంటూ మురిసిపోతోంది. "నేను పెళ్లి మండ‌పంలో నడిచిన క్షణం నుండి చివరి వరకు అది చాలా అందంగా ఉంది. అప్పుడు నా భర్త మార్సెలోతో కలిసి మొద‌టి రాత్రికి వెళ్లాను. మేమిద్ద‌రం ఆ రోజును చాలా ఆనందించాము" అని చెప్పింది. ఇప్పుడు తాజాగా, ఈ జంట త‌మ కుటుంబంలోకి ఒక బిడ్డ‌ను కూడా ఆహ్వానించారు. ఆసుప‌త్రిలో జ‌రిగిన ఈ పురుడు కార్య‌క్ర‌మాన్ని దాదాపు 200 మందితో మోరేస్‌ ప్రత్యక్ష ప్రసారం కూడా చేయ‌డం విశేషం. వీరిద్ద‌రి బంధాన్ని మీరూ చూడండి..

Next Story

Most Viewed