- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి సివిల్ సప్లైస్ శాఖ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి సివిల్ సప్లైస్ శాఖ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని పలుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో ఒక ఐచర్ వ్యాన్, ఏడు మినీ లేలాండ్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. అనంతరం వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, బియ్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సన్న రేషన్ బియ్యాన్ని ఎవరికి, ఏ ఉద్దేశంతో తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, వాహనాలను పోలీసులకు అప్పగించినట్లు ఓఎస్డీ వెల్లడించారు.






