నేను మంచోడిని.. పెళ్లి చేసుకోండి! లండన్‌లో ఇండియన్ కుర్రాడి యాడ్

by Disha Web Desk 12 |
నేను మంచోడిని.. పెళ్లి చేసుకోండి! లండన్‌లో ఇండియన్ కుర్రాడి యాడ్
X

దిశ, ఫీచర్స్ : ఇండియాకు చెందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒకరు.. తనకు కాబోయే భార్యను వెతికేందుకు ఇంట్రెస్టింగ్ ఐడియాను ఇంప్లిమెంట్ చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న ఆ యువకుడు.. 'బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్‌'గా తన క్వాలిటీస్ పేర్కొంటూ ఓ అడ్వర్టయిజ్‌మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో అతని ప్రకటనకు మంచి రెస్పాన్స్ లభించగా.. కోవిడ్ తర్వాత మ్యాచ్ మేకింగ్ యాప్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్లే ఈ ఆలోచనతో ముందుకు వచ్చినట్లు చెప్పాడు.

భారత సంతతికి చెందిన 31 ఏళ్ల జీవన్ భచు.. లండన్‌ ట్యూబ్ స్టేషన్‌లోని రెండు భారీ బిల్‌బోర్డ్స్ అద్దెకు తీసుకుని, తనను తాను బెస్ట్ హజ్బెండ్ మెటీరియల్‌గా ప్రచారం చేసుకుంటున్నాడు. రెండు వారాలపాటు ఆక్స్‌ఫర్డ్ సర్కస్‌లోని సెంట్రల్ అండ్ బేకర్‌లూ లైన్స్ వద్ద గల ప్లాట్‌ఫామ్స్‌పై యాడ్స్ ప్రదర్శించిన యువకుడు.. 'జీవన్‌కు భార్యను వెతికిపెట్టండి' క్యాంపెయిన్‌ను కంటిన్యూ చేశాడు. ఇక పింక్ సూట్‌తో హ్యాండ్‌సమ్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ యాడ్‌కు 'ఈ బెస్ట్ ఇండియన్‌ను మీరు తీసుకెళ్లొచ్చు' అనే క్యాప్షన్‌తో అటెన్షన్ క్యాచ్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 50 మంది నుంచి రెస్పాన్స్ లభించిందని, కానీ జెన్యూన్‌ రెస్పాన్స్‌ను గుర్తించి సరైన అమ్మాయిని ఎంచుకుంటానని చెప్తున్నాడు. కాగా జీవన్ ఐడియా పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. త్వరలోనే 'పర్‌ఫెక్ట్ మ్యాచ్' గుడ్ న్యూస్ చెప్పాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Next Story