- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ ఫైల్స్.. 3 మిలియన్ల డాక్యుమెంట్లు, 2 వేల వీడియోలు విడుదల
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం విచారణలోని కీలక పత్రాలను విడుదల చేసింది అమెరికా న్యాయశాఖ.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచాన్ని షేక్ చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం విచారణలోని కీలక పత్రాలను మరోసారి విడుదల చేసింది అమెరికా న్యాయశాఖ. ఈసారి ఏకంగా 30 లక్షల పేజీలు, 2 వేల వీడియోలు ఉన్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బయటపెడుతున్నట్లు తెలిపింది. ఈ పత్రాలన్నీ న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ దర్యాప్తు పత్రాల విడుదలకు గడువు గతేడాది డిసెంబర్ 19తోనే ముగియగా, అప్పట్లో కొన్ని వేల డాక్యుమెంట్లు మాత్రమే విడుదల చేసారు. వాటిలో మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా హాట్ టబ్‌లో యువతులతో బిల్ క్లింటన్ ఉన్న ఫొటోలు, ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న చిత్రాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
అయితే అప్పట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలు లేకపోవడంతో కొన్ని ఫైల్స్ దాచిపెట్టారనే ఆరోపణలు కూడా వినిపించాయి. తాజా వివరాలు విడుదల చేసిన నేపథ్యంలో బాధిత యువతుల ప్రైవసీకి భంగం కలగకుండా.. వారి పేర్లు, ఫొటోలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఎప్‌స్టీన్ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
- Tags
- Epstein files
- USA






