- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫంక్షన్‌లో మిగిలిన కూరలను విద్యార్థులకు పెట్టిన సిబ్బంది.. 22 మంది ఆసుపత్రి పాలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లా సదాశివపేట(Sadashivapet) మండలం వెంకటాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 మంది వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వెంకటాపూర్ గ్రామంలో ఓ శుభకార్యం జరిగింది. అక్కడ భారీ స్థాయిలో వంటలు మిగిలిపోయాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం లంచ్ సమయంలో ఆ ఫుడ్(Food Poisoning)ను స్కూల్‌కు తీసుకొచ్చి వేడి చేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గమనించిన స్కూల్ టీచర్స్ విద్యార్థులు అందరినీ దగ్గర్లోని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. లంచ్‌లో తిన్న కూరలు వికటించాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.






