- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎన్‌సీపీఐ’లో విలీనమైన 20 మంది టీఎంసీ ఎంపీలు
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి భారీ షాక్.. ఎన్‌సీపీఐ (NCPI) పార్టీలో విలీనమైన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు!

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీఎంపీ పార్టీ (TMP party)కి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయగా మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది తీసుకున్న నిర్ణయంతో.. బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన 20 మంది పార్లమెంట్ సభ్యులు (MPs) ఒక్కసారిగా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమయ్యారు. నార్త్ 24 పరగణాస్ జిల్లా వేదికగా జరిగిన ఈ భారీ రాజకీయ పరిణామం బెంగాల్‌తో పాటు దేశ రాజధాని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చారిత్రాత్మక విలీనంపై ఎన్‌సీపీఐ (NCPI) వ్యవస్థాపకుడు, జాతీయ సంస్థాగత కార్యదర్శి శంతను డే మాట్లాడుతూ.. సోమవారం ఉదయం తమ పార్టీ అగ్రనాయకత్వం ఆన్‌లైన్ ద్వారా సమావేశమై, టీఎంసీ ఎంపీల చేరికను హృదయపూర్వకంగా స్వాగతించిందని తెలిపారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన స్పందిస్తూ.. "ఇప్పటివరకు పార్టీ సభ్యులందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే నేను కీలక నిర్ణయాలు తీసుకునేవాడిని. పార్టీ అధ్యక్షురాలు శ్వేలి కుందును సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, తాను బిజీగా ఉన్నానని చెప్పారు. పార్టీ కోశాధికారిగా ఉన్న ఆమె భర్త ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. మా పార్టీ 2023లో నమోదైంది. అయితే 2025 తర్వాత ఆమె మాతో మాట్లాడటం పూర్తిగా మానేశారు" అని వెల్లడించారు. తాము పార్టీని సమర్థవంతంగా నడపాలని భావించినప్పటికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, 2022 నుంచి తాను పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నానని శంతను డే పేర్కొన్నారు. కాగా, గతంలో త్రిపురలో తాము ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.






