- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాను మరణించి మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చిన 10 నెలల చిన్నారి
తాను మరణించినా అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మనిచ్చిన 10 నెలల చిన్నారి ఘటన కేరళలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహాం అవయవదానంతో మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చింది. ఇటీవల జరిగిన ఆ ఘోర ప్రమాదంలో ఆలిన్ బ్రెయిన్ డెడ్ అవ్వగా.. ఆమె తల్లిదండ్రులు ఆర్గాన్ డొనేషన్ కి ముందుకు రావడంతో.. కేరళలోనే అతిచిన్న అవయవదాతగా ఆలిన్ షెరీన్ రికార్డులకెక్కింది.
ఇంతకీ ఏం జరిగిందంటే...?
ఆలిన్ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహాం, షెరిన్ ఆన్ జాన్. పతనంతిట్ట జిల్లాలోని మల్లపల్లిలో నివసిస్తుండగా.. ఈనెల 5న కొట్టాయం జిల్లాలోని పల్లం-బోర్మా జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలిన్ తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని కొచ్చిలోని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు చాలా రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆలిన్ ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఇంతటి బాధలోనూ ఆలిన్ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ మరణంలో కూడా ఇతరులకు జీవితం ఇవ్వాలని భావించి, కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (K-SOTTO) ద్వారా అవయవదానానికి అంగీకరించారు. ఆలిన్ యొక్క రెండు కిడ్నీలు, లివర్, హార్ట్ వాల్వ్ మరియు కార్నియాలు దానం చేయబడ్డాయి. ఈ అవయవాలు మరో ఐదుగురు చిన్నారులకు ట్రాన్స్ ప్లాంట్ చేసారు. వీరిలో ఒకరు కేవలం ఆరు నెలల చిన్నారి కూడా ఉన్నారు.
సీఎం నివాళులు
ఈ సంఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆలిన్ తల్లిదండ్రుల ధైర్యాన్ని ప్రశంసించారు. అంతేకాదు రేపు ఆలిన్ షెరిన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపనున్నారు. అంత్యక్రియలు సీఎం పి విజయన్, ఆరోగ్యమంత్రి కూడా హాజరయ్యి, ఆలిన్ మృతదేహంపై పుష్పగుఛ్చాన్ని ఉంచి, నివాళులు అర్పించనున్నారు. కాగా "మా బిడ్డ మరణంలో కూడా ఇతరులకు జీవితం ఇవ్వాలి" అంటూ ఆలిన్ తల్లిదండ్రులుమీడియా ముందు కంటతడి పెట్టుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఆలిన్ మానవత్వానికి నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన అవయవదానంపై దేశవ్యాప్త చర్చకు తెర లేపింది.






