- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీనగర్ మార్కెట్‌లో గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి, 20 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. శ్రీనగర్ లోని..latest telugu news

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. శ్రీనగర్ లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గ్రెనెడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 'సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బంది మోహరించి ఉన్న ప్రాంతంలో ముష్కరులు గ్రెనెడ్ విసిరారు.
ఆ సమయంలో మార్కెట్ రద్దీగా ఉంది. ఈ ఘటనలో 71 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి' అని సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ బల్వాల్ తెలిపారు. గాయపడిని వారిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. అయితే దాడికి పాల్పడింది ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సామాన్యులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.






