గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2026-01-28 00:28:58  IST  )

ఎట్టకేలకు నిరుద్యోగుల ఆశలు ఫలించాయి. గ్రూప్ 2 అభ్యర్థుల ఎంపిక జాబితా వెలువడ్డాయి.

గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు నిరుద్యోగుల ఆశలు ఫలించాయి. గ్రూప్ 2 అభ్యర్థుల ఎంపిక జాబితా వెలువడింది. 2023 కు చెందిన గ్రూప్ 2 రిజల్ట్స్ లిస్టును ఏపీ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి దాటాక విడుదల చేసింది. 905 పోస్టులకు గాను APPSC 891 మందిని ఎంపిక చేసింది. దివ్యంగా రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కోటాపై హైకోర్టు ఆదేశాలతో 2 పోస్టులను కమిషన్ పక్కన పెట్టింది. తుదితీర్పును బట్టి ఈ నియామకాలు జరుపుతామని APPSC పేర్కొంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గ్రూప్‌-2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story