స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి ?

by Disha Tech |
స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి ?
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. మంటల్లో ఎనిమిది మందికి పైగా చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, వీరిలో ఐదుగురు మృతి చెందినట్లు తెలిసింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 4వ ఫ్లోర్లో స్పృహలేకుండా పడి ఉన్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా ప్రమీల, వెన్నెల, శ్రావణి, ప్రశాంత్, త్రివేణి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరో వైపు అగ్నిమాపక సిబ్బంది అలుపెరుగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. భీకరంగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు

Next Story