ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే మీకు తెలియకుండానే డబ్బు పోతుంది..!

by Disha Web Desk 7 |
ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే మీకు తెలియకుండానే డబ్బు పోతుంది..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత సమాజంలో జీవించడానికి ప్రధానంగా డబ్బు అవసరం. ఆనందంగా ఉండాలన్న, అనుకున్నది జరగాలన్న, చావుకి, బ్రతుకుకి ప్రతి విషయం డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే.. చాలా మందికి డబ్బును సంపాదించే టాలెంట్ ఉంటుంది కానీ దానిని దాచిపెట్టుకోలేరు. ఇక కష్టపడి, చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ము అయితే పోయిన తిరిగి వస్తుంది అంటారు. కానీ ఇప్పటి రోజుల్లో చాలా మంది జీవితాన్ని సరళంగా, సులభంగా మార్చుకోవడానికి తప్పుడు మార్గాల్లో సైతం డబ్బును సంసాదిస్తున్నారు. అయితే డబ్బును త్వరగా నాశనం చేసే కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి. చాణక్య నీతి ప్రకారం.. అలాంటి అలవాట్ల ద్వారా డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉండదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొంత మంది డబ్బు మీద వ్యామోహంతో అక్రమంగా సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే ఇతరులకు హాని కలిగించడం, మతపరమైన చర్యలు, శత్రువుతో చేరి తప్పులు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. అయితే.. చాణక్య నీతి ప్రకారం అలా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదట. ఏ రకంగా వచ్చిందో అదే క్రమంలోనే మన నుండి దూరం అవుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.

* ఇక మరికొందరు కష్టపడకుండా డబ్బు సంపాదించే ప్రయత్నంలో.. దొంగతనాలు, బెట్టింగ్‌లు, జూదాల ద్వారా సంపాదిస్తున్నారు. ఇలాంటి సంపాదన వల్ల కష్టాలు రావడమే కాకుండా.. ఆ డబ్బు కూడా ఎక్కువ రోజులు నిలవదట.

* చాణక్యుని నీతి ప్రకారం.. ఒక వ్యక్తి ఎప్పుడూ దురాశ, స్వార్థం, అత్యాశతో ఉండకూడదు. సంపదలకు దేవతైన లక్ష్మీదేవి స్వార్థపరులు, అత్యాశపరులకు దూరంగా ఉంటుందట. కాబట్టి ఈ క్రమంలోనే వచ్చిన డబ్బు తాత్కాలికంగా సంతోషపెట్టవచ్చు కానీ.. ఎక్కువ కాలం నిలవదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

* ఇక ఫైనల్‌గా మితిమీరిన ఖర్చు, ఉపయోగం లేని ఖర్చులకు ఎక్కవగా డబ్బును ఉపయోగించే వారి దగ్గర ధనలక్ష్మీ అస్సలు నిలవదని చాణక్యుడు చెబుతున్నాడు.



Next Story

Most Viewed