రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసింది : కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసింది : కోమటిరెడ్డి
X

దిశ, ఇబ్రహీంపట్నం :- భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో భాగంగా… శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం అంబేద్కర్ చౌరస్తా లో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని కూతురు కవితతో పాటు కేసీఆర్ కూడా జైలుకి పోవడం ఖాయమన్నారు.

మా కుటుంబ సభ్యులు ఎవరు ఎంపీ టికెట్ ఆశించలేదని, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానని మాట ఇచ్చానని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో 3లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. హరీష్ రావు రాజీనామా చేస్తానని దొంగ మాటలు మాట్లాడే ముందు తన మామ కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని లేకపోతే తల కోసుకుంటానని చెప్పిన మామ తలను ముందు తీసుకురావాలని తర్వాతే ఆరు పథకాల గురించి మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మైపాల్, సీనియర్ ఈసీ శేఖర్ గౌడ్, మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి చందు, వివిధ మండలాల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed