- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొంగులేటి, తుమ్మల పోటీచేసే నియోజకవర్గాలు ఖరారు
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే వామపక్షాలతో పొత్తు ఖరారు చేసి చెరో రెండు సీట్లు చొప్పుల నాలుగు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే వామపక్షాలతో పొత్తు ఖరారు చేసి చెరో రెండు సీట్లు చొప్పుల నాలుగు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఖమ్మం జిల్లాలోని కీలక నేతలైన తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పోటీచేసే నియోజకవర్గాలను కూడా అధిష్టానం ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగానే తుమ్మల పాలేరు నియోజకవర్గం నుంచి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాగా, వీరిద్దరూ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోము అంటూ ఏకంగా సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు.
Next Story






