- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్లు తెలిపారు. కాగా, కేబినెట్ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. అంతేగాక, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంటల గురించి కూడా కేబినెట్‌లో చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు.
Next Story






