- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే తొలి సీటు అదే
by GSrikanth |
కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే తొలి స్థానం అదే అవుతుందని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే తొలి స్థానం అదే అవుతుందని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించే దమ్ము, ధైర్యం ఒక్క రేవంత్ రెడ్డికే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను ఓడించి, కేసీఆర్‌ను గద్దె దింపాలని రాష్ట్ర ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ను రేవంత్ ఓడిస్తే.. ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడుతుందని అన్నారు.
Next Story






