తెలంగాణ ఎన్నికలు.. ఓటర్లకు RGV సంచలన పిలుపు

by Kodari Anjali |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ అర్టిస్ట్ అసోసియేషన్.. సోమజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తెలంగాణ ఎన్నికలు.. ఓటర్లకు RGV సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ అర్టిస్ట్ అసోసియేషన్.. సోమజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ముఖ్య అతిథిగా హాజరై.. తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘‘ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే నాయకులకు మాత్రమే వేయండి. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాంటి ఓటును అమ్ముకోవద్దు. ప్రజలకు మంచి చేసే వారిని మాత్రమే గెలిపించుకోవాలి. ప్రజాహితం, సుపరిపాలన కోరుకునేవారు ప్రజలను కోరుతుంటారు.

నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగి, ప్రజల సమస్యలు తెలిసుకుని, ప్రజలకు మౌళిక వసతులు కల్పించే నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ఆర్జీవీ తెలంగాణ ప్రజలకు సూచించారు. అలాగే రాజకీయ పార్టీల మేనిఫెస్టోను నేను చూడలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడలేనని అన్నారు. ఈ మేనిఫెస్టోను రూపొందించడం, అమలుచేయడం ఎలాగో తెలిస్తే దానిపై మాట్లాడటం ఎందుకు? నేనే రాజకీయ నాయకుడిగా మారేపోయేవాడినని ఆర్జీవీ తెలిపారు.

Next Story