- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలిటికల్ ‘పుష్ప’లు ఎంట్రీ..? డబ్బుల పంపిణీకి అభ్యర్థుల నయా స్కెచ్!
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఎర్రచందనం దుంగలను పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేయడం ఆ మూవీ సారాంశం.

దిశ, రాచకొండ : అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఎర్రచందనం దుంగలను పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేయడం ఆ మూవీ సారాంశం. దీనినే స్ఫూర్తిగా తీసుకోని తెలుగు రాష్ట్రాల్లో గంజాయిని సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు. పోలీసులు వీరి ఆటకట్టిస్తున్నా.. తాజాగా అదే దారిని ఎంచుకున్నారు రాజకీయ నాయకులు. ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బులను పంచేందుకు పుష్ప తరహా రవాణకు తెరలేపినట్టు పోలీసులకు ఉప్పందింది. 21 సరికొత్త మార్గాలను ఎంచుకున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే నగదు, ఇతర గిఫ్ట్స్ ను తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులకు క్లూ అందింది. కానీ ఎవరు, ఏ స్టైల్‌లో వెళుతున్నారనే విషయం బయటికి రాకపోవడంతో పోలీసులు ఆ నగదును పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా పోలీసులు తమ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్‌ను పటిష్టం చేసుకుంటున్నారు.
అయితే రాజకీయ పుష్పలు మాత్రం డిపార్ట్‌మెంట్‌కు చిక్కకుండా మస్కా కొట్టిస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పోలీసులకు మరో కీలక సమాచారం అందిందని తెలుస్తోంది. అంబులెన్స్‌లు, మీడియా స్టికర్లతో ఉన్న వాహనాలు, వివిధ ప్రభుత్వ స్టికర్లతో నగదును తరలించేందుకు పొలిటిషన్స్ స్కెచ్‌లు వేశారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీనిపై కూడా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కరెన్సీ పంపకాలు ఉంటాయని ఆ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెంచారు. ఇంకోవైపు చెక్ పోస్టుల వద్ద తనిఖీల పంథాను మార్చిన పోలీసులు.. నగదును అక్రమంగా తరలించే పొలిటికల్ పుష్పాల సమాచారం సేకరణలో నిమగ్నమైపోయారు.
Read More..






