డీప్‌ఫేక్‌లపై కేటీఆర్ అప్రమత్తం.. బీఆర్ఎస్ శ్రేణులకు కీలక హెచ్చరిక

by Disha Web Desk 2 |
డీప్‌ఫేక్‌లపై కేటీఆర్ అప్రమత్తం.. బీఆర్ఎస్ శ్రేణులకు కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: డీప్‌ఫేక్‌పై బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులను మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు. పోలింగ్ సమీపిస్తోన్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని.. డీప్‌ఫేక్‌లతో దుష్ప్రాచారం చేస్తుందని తెలిపారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.

కాగా, డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సామాన్యులకే కాదు.. ప్రముఖులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ అంశంలో హీరోయిన్లు రష్మికా మందన్నా, కాజోల్, కత్రినా కైఫ్‌లు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అంతేకాదు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఈ టెక్నాలజీతో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎన్నికల వేళ ముందే అప్రమత్తమైన కేటీఆర్ కార్యకర్తలను అప్రమత్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed