బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిక!

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్‌‌కు కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. బీఆర్ఎస్‌లో తనకు ఇన్నాళ్లు సహకరించని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. కాగా, ఇవాళ హైదరాబాద్‌లో CWC సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టికెట్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు నియోజకవర్గ టికెట్ కోసం పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటికే ఈ రెండు స్థానాల విషయంలో ఇరువురు నేతల మధ్య పార్టీ సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.




Next Story

Most Viewed